Secunderabad Ujjain Mahaankali Bonala Jatara will be held grandly from July 13 to 15. Thousands of devotees are expected to reach the temple. All arrangements have been made for the convenience of the devotees. Water facilities and health camps have also been set up for the arriving devotees. Sanath Nagar Congress in-charge and TPCC Vice President Kota Neelima are closely monitoring the arrangements. Bonalu 2025.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి బోనాల జాతర జూలై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనున్నాయి. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండగా.. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తుల కోసం నీటి సదుపాయం, అలాగే హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. సనత్ నగర్ కాంగ్రెస్ ఇంఛార్జీ, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆమె చెప్పారు. ఈ బోనాల జాతరలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం రంగం (భవిష్యవాణి) కార్యక్రమంతోపాటు అమ్మవారి అంబారీ (ఏనుగు ఊరేగింపు) కూడా జరగనుంది. లక్షలాది భక్తులు హాజరయ్యే ఈ ఆషాఢ మాస ఉత్సవంలో మహిళలు అమ్మవారికి బోనం అర్పిస్తారు.
#ujjainimahakalibonalu
#cmrevanthreddy
#hyderabad